ఇది జగన్ ను టార్గెట్ చేసుకున్న దాడేనని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్ కు భుజం పై కాకుండా మెడపై కత్తి తగిలి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జగన్ సానుభూతి కోసం ఈ దాడిచేయించుకున్నాడని టీడీపీ నేతలు మాట్లాడటం దుర్మార్గమన్నారు. దాడి జరిగిన వెంటనే డీజీపీ ప్రకటనచేయడం కూడా తమ అనుమానాలకు కారణమయిందన్నారు. జగన్ హుందాగా ప్రవర్తించినా, చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు నీచ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారన్నారు. అందుకే ధర్డ్ పార్టీ సంస్థతో ఈ దాడి ఘటనపై దర్యాప్తు చేయాలని వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. డీజీపీ తొలుత విచారణ కు ఆదేశించకుండా ప్రకటన చేయడమేంటని ప్రశ్నించారు. జగన్ పై జరిగిన హత్యాయత్నం వెనుక ఎవరున్నారన్నది నిలకడమీద తెలుస్తుందన్నారు.