ఎమ్మెల్యే వీడియో వైరల్

ఎప్పడూ సంచలనాలకు కేంద్ర బిందువుగా వుండే ఎంఐఎం పార్టీ ఇప్పడు మరొక వివాదంలో చిక్కుకుంది. ఒకరిపైన దాడి చేస్తూ స్వయంగా ఎమ్యెల్యేనే మీడియాకు చిక్కాడు. సోషల్ మీడియాలో [more]

Update: 2019-08-12 01:40 GMT

ఎప్పడూ సంచలనాలకు కేంద్ర బిందువుగా వుండే ఎంఐఎం పార్టీ ఇప్పడు మరొక వివాదంలో చిక్కుకుంది. ఒకరిపైన దాడి చేస్తూ స్వయంగా ఎమ్యెల్యేనే మీడియాకు చిక్కాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ఇప్పడు ఎంఐఎం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ేకంగా మోరల్ పొలిసింగ్ ను ఎమ్మెల్యే చేశారంటూ సొషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సొషల్ మీడియాలో ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ పైన విమర్శలు పెద్ద ఎత్తున్న రావడంతో దిద్దు బాటు చర్యలకు చెపట్టారు. సదరు బాధితుడితో ఒక వీడియోను రికార్డు చేయించి విడుదల చేయించారు. ఎమ్మెల్యే మంచి వాడు .. అతని దగ్గర డబ్బులు తీసుకుని తాగిన మత్తులో ఎమ్మెల్యేనే తిట్టానని ..అందుకు పిలిచి మందలించాడని ,తన మంచికోసమే ఎమ్మెల్యే తనను కొట్టాడని బాధితుడు వీడియో లో చెప్పాడు.

మద్యం తాగుతున్నాడని…..

కార్వాన్ కు చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ . ఇతను ఎప్పడూ సంచలనాలకు కేంద్ర బిందువే. ఎమ్మెల్యే స్వయంగా ఒకరిని కొడుతున్న విడియో బయటికి వచ్చింది. ఎంఐఎం ఎమ్యెల్యే కార్యాలయంలో పనిచేసే ఖాన్ కు మద్యం తాగే అలవాటు వుంది. ఈ నేపధ్యంలోనే రోజూ మద్యం తాగుతాడు. టుంబ అవసరాలకు అని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుని ఖాన్ మద్యం తీసుకుంటాడు. ఈ వ్యవహారం తెలిసి ఎంఐఎం ఎమ్మెల్యే పలు మార్లు ఖాన్ ను హెచ్చరించారు. అందరి దగ్గర డబ్బులు తీసుకుని మద్యం తాగవద్దని , కుటుంబ అసవరాలకు కోసం డబ్బులను వాడుకోవాలని చెప్పారు. అయినా ఖాన్ లో మార్పు రాలేదు. ఎమ్మెల్యే తో పాటుగా ఎంఐఎం కార్పొరేటర్ల వద్ద కూడా ఖాన్ డబ్బులు తీసుకుని మళ్లీ తాగాడు. తాగిన మత్తులో ఎమ్మెల్యే, కార్పొరెటర్ ను నానా బూతులు తిట్టారు. ఈ విషయం ఎమ్మెల్యేకు తెలిసింది. దీంతో నాలుగు రొజుల క్రితం ఖాన్ కార్యాలయానికి వచ్చాడు. ఈ సమయంలో ఎమ్మెల్యేతో పాటుగా కార్పొరెటర్ కూడా అక్కడే వున్నారు. దీంతో ఆగ్రహాంతో ఉగిపొయిన ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ వెంటనే ఒక కర్రను చెతిలోకి తీసుకుని ఖాన్ ను చితక్కకొట్టాడు. మళ్లీ తప్పు చేస్తావా అంటూ అగ్రహాంతో ఖాన్ పైన ఎమ్మెల్యే పదే పదే దాడి చేశారు. తరువాత అక్కడే వున్న కొందరి కాళ్లు ను కూడా ఎమ్మెల్యే మొక్కించాడు. ఈ వీడియో సొషల్ మీడియాలో వైరల్ కావడంతో దిద్దు బాటు చర్యల్లో భాగంగా బాధితుడితోనే వీడియో తయారు చేయించి విడుదల చేశారు. ఇందులో ఎమ్మెల్యే తప్పు ఏమి లేదని చెప్పించారు.

Tags:    

Similar News