మరో ఛార్జిషీట్లోనూ కవిత పేరు

ఈడీ దాఖలు చేసిన మరో ఛార్జిషీట్ లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి పేర్లు ఉన్నాయి

Update: 2022-12-21 02:21 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాఖలు చేసిన మరో ఛార్జిషీట్ లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేర్లు ఉన్నాయి. వీరితో పాటు మాగుంట కుమారుడు రాఘవరెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్చంద్రారెడ్డి పేర్లు కూడా ఉన్నాయి. సమీర్ మహేంద్రు కేసులో దాఖలయిన ఛార్జిషీట్ లో మరోసారి ఈ పేర్లు ఈడీ పేర్కొంది. సమీర్ మహేంద్రు కంపెనీలో కవితకు 32 శాతం వాటాలున్నట్లు ఈడీ పేర్కొంది. ఈ ఛార్జిషీట్లో వీరందరితో పాటు మూత్తం గౌతమ్, అరుణ రామచంద్ర పిళ్లై అభిషేక్ రావు పేర్లు కూడా ఉన్నాయి.

అందరూ కలసి...
ఒబెరాయ్ హోటల్ లో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఈహోటల్ లో శరత్ చంద్రారెడ్డి, అభిషేక్, బుచ్చిబాబు సమీర్ మహేంద్రును కలిసినట్లు ఈడీ తెలిపింది. వీరంతా కలసి శరత్చంద్రారెడ్డికి చెందిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లారని,అనంతరం జరిగిన మీటింగ్లో కవిత, అరుణ్ పిళ్లై, దినేష్ అరోరా, విజయ్ నాయర్ పాల్గొన్నారని ఈడీ ఛార్జిషీట్ ల పేర్కొంది. ఇండో స్పిరిట్స్ లో ఎల్ 1 కింద వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని, ఇండో స్పిరిట్ కు 192 కోట్లు లాభం వచ్చిందని తెలిపింది. శరత్చంద్రారెడ్డికి చెందిన ఐదు రిటైల్ జోన్లలను అభిషేక్ రావు నడిపిస్తున్నారని తెలిపింది. కవిత తన పది ఫోన్లను ధ్వంసం చేశారని కూడా ఛార్జిషీట్ లో తెలిపింది.


Tags:    

Similar News