బాబుకు ఓటేస్తే…??

చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ మునిగిపోతుందని వైసీపీ నేత, సినీ నటుడు మోహన్ బాబు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీని ఎన్టీఆర్ నుంచి లాక్కున్న [more]

Update: 2019-03-30 13:25 GMT

చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ మునిగిపోతుందని వైసీపీ నేత, సినీ నటుడు మోహన్ బాబు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీని ఎన్టీఆర్ నుంచి లాక్కున్న చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్టీఆర్ మీద వైశ్రాయ్ హోటల్ వద్ద చెప్పులేయించడం తనకు తెలుసన్నారు. చంద్రబాబుకు క్యారెక్టర్ లేదన్నారు. చంద్రబాబు కంటే ముందే టీడీపీలో తాను చేరానని గుర్తు చేశారు. చంద్రబాబు ఎదుటి వారి ఎదుగుదలను ఓర్వలేరన్నారు. ఏపీలో పాలన చూసుకోకుండా తెలంగాణలో చక్రం తిప్పుతానని పోయిన చంద్రబాబుకు ప్రజలు బుద్ధిచెప్పారన్నారు. పదేళ్లు ఉమ్మడి రాజధాని ఉన్నా ఓటుకు నోటు కేసులో దొరికిపోయి విజయవాడకు వచ్చేశారన్నారు. జగన్ కు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. కచ్చితంగా రాష్ట్రానికి జగన్ మేలు చేస్తారనే నమ్మకం తనకుందన్నారు.

Tags:    

Similar News