జగన్ ఒక పెదరాయుడు

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గొప్ప ప్రజా నాయకుడని సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు పేర్కొన్నారు. వైసీపీ విజయంపై తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… శ్రీరాముడి [more]

Update: 2019-05-24 08:20 GMT

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గొప్ప ప్రజా నాయకుడని సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు పేర్కొన్నారు. వైసీపీ విజయంపై తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… శ్రీరాముడి పట్టాభిషేకం ఎలా జరిగిందో జగన్ కు కూడా ప్రజలు అలానే పట్టం కట్టారని పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపన జగన్ లో ఉందన్నారు. జగన్ చేసిన సుదీర్ఘ పాదయాత్రే ఆయనను గెలిపించిందని అన్నారు. జ్యోతిబసులా జగన్ పరిపాలన ఉండాలని, 20 ఏళ్లు జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించారు. జగన్ ఒక పెదరాయుడు లాంటివారన్నారు.

Tags:    

Similar News