Posani : ఆ పనిచేస్తే పవన్.. నీకు గుడి కడతా

పవన్ కల్యాణ్ వైసీపీ మంత్రులపై చేసిన వ్యాఖ్యలపై సినీనటుడు పోసాని కృష్ణమురళి అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ తానే ప్రశ్నలు వేసుకుంటారని, తానే జవాబులు చెప్పకుంటారని [more]

Update: 2021-09-27 13:57 GMT

పవన్ కల్యాణ్ వైసీపీ మంత్రులపై చేసిన వ్యాఖ్యలపై సినీనటుడు పోసాని కృష్ణమురళి అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ తానే ప్రశ్నలు వేసుకుంటారని, తానే జవాబులు చెప్పకుంటారని అన్నారు. జగన్ కు కులపిచ్చి ఉందని ఆధారాలు చూపించాలని పోసాని కృష్ణమురళి డిమాండ్ చేశారు. పంజాబ్ నుంచి వచ్చిన టాలీవుడ్ హీరోయిన్ ను ఒక తెలుగు సినీ ప్రముఖుడు మోసగిస్తే ఏం చేశారని నిలదీశారు. ఆ బాధితురాలికి న్యాయం చేస్తే పవన్ కు గుడికడతానని చెప్పారు. పవన్ కల్యాణ్ వాడిన భాష సరిగా లేదన్నారు. చిరంజీవి నోట అమార్యదకరమైన మాటలు ఎప్పుడూ రాలేదన్నారు. పవన్ కల్యాణ‌్ రెండు చోట్ల పోటీ చేసి ఒక్కచోటైనా గెలిచారా అని ప్రశ్నించారు. అనేక పుస్తకాలు చదివిన పవన్ కల్యాణ‌్ సరైన బాష నేర్చుకుంటే మంచిదని పోసాని కృష్ణమురళి హితవు పలికారు. జగన్ తో పోల్చుకోవడానికి నీ జీవితం సరిపోదన్నారు.

Tags:    

Similar News