మన్నించండి.. మీ మాటను కాదంటున్నా
కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి నాయకత్వం వహించేందుకు ముద్రగడ పద్మనాభం సుముఖత వ్యక్తం చేయలేదు. ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. కాపు రిజర్వేషన్ పోరాట కమిటీ జేఏసీ నేతలు [more]
కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి నాయకత్వం వహించేందుకు ముద్రగడ పద్మనాభం సుముఖత వ్యక్తం చేయలేదు. ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. కాపు రిజర్వేషన్ పోరాట కమిటీ జేఏసీ నేతలు [more]
కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి నాయకత్వం వహించేందుకు ముద్రగడ పద్మనాభం సుముఖత వ్యక్తం చేయలేదు. ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. కాపు రిజర్వేషన్ పోరాట కమిటీ జేఏసీ నేతలు ముద్రగడ పద్మనాభంను కిర్లంపూడి లోని ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. వారు లోపలికి వచ్చిన వెంటనే ముద్రగడ పద్మనాభం వారిచేతిలో లేఖ పెట్టారు. తాను ఉద్యమానికి నాయకత్వం వహించలేనని, వ్యక్తిగతంగా మద్దతిస్తానని తెలిపారు. కోరికను గౌరవించనందుకు క్షమించాలని కోరారు. ఉద్యమానికి దూరం కావద్దని ఈ సందర్భంగా కాపునేతలు కోరారు.