నేనెవరినీ మోసం చేయలేదు.. ప్రజలే నా బలం
నలభై ఏళ్ల క్రితమే మధుకాన్ కంపెనీని స్థాపించానని ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. తాను ప్రస్తుతం ఏ కంపెనీలోనూ డైరెక్టర్ గా లేనని చెప్పారు. తాను కంపెనీని [more]
;
నలభై ఏళ్ల క్రితమే మధుకాన్ కంపెనీని స్థాపించానని ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. తాను ప్రస్తుతం ఏ కంపెనీలోనూ డైరెక్టర్ గా లేనని చెప్పారు. తాను కంపెనీని [more]
నలభై ఏళ్ల క్రితమే మధుకాన్ కంపెనీని స్థాపించానని ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. తాను ప్రస్తుతం ఏ కంపెనీలోనూ డైరెక్టర్ గా లేనని చెప్పారు. తాను కంపెనీని స్థాపించి ఎవరినీ మోసం చేయలేదని నామా నాగేశ్వరరావు చెప్పారు. ఈ సంస్థను తమ సోదరులు ఇద్దరూ చూసుకుంటున్నారని చెప్పారు. 25న విచారణకు రావాల్సిందిగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిందని, ఖచ్చితంగా విచారణకు వెళ్లి సహకరిస్తానని నామా నాగేశ్వరరావు చెప్పారు. తాను 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, తన బలం ప్రజలేనని ఆయన చెప్పారు.