భారతీయ జనతా పార్టీ తమతో పొత్తును ముందుగానే తెంచుకుందని నారా చంద్రబాబునాయుడు అన్నారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని అమిత్ షా తొలుత ప్రకటించారన్నారు. పొత్తు ధర్మాన్ని కనీసం పాటించడం లేదన్నారు. కేసీఆర్ తో కలసి నడుద్దామనుకుంటే బీజేపీ ఆయనను తమ వైపునకు తిప్పుకుందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మోసం చేసిందన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతోంది. అందుకే కాంగ్రెస్ తో కలసి నడవాలని నిర్ణయించుకున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు దేశ ప్రయోజనాలకూ తమకు అవసరమేనన్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు గత ఎన్నికల్లోనే బుద్ధి చెప్పారని, వారిలో మార్పు వచ్చిందన్నారు. ఇప్పుడు ఏపీలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ తనకు గట్టిగా హామీ ఇచ్చారన్నారు.