నేరాలు చేసే వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే ప్రమాదకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. దాడి జరిగిన గంటలోనే గవర్నర్ నరసింహన్ డీజీపీకి ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా డీజీపీకి గవర్నర్ ఎందుకు ఫోన్ చేశారన్నారు. జగన్ ను అడ్డం పెట్టుకుని బీజేపీ నాటకాలాడుతుందన్నారు. తాను పద్ధతిగా రాజకీయాలు చేశానని, ఎన్నడూ పక్కదారి పట్టలేదని చంద్రబాబు అన్నారు. టీటీడీ వ్యవహారంలోనూ రమణదీక్షితులను అడ్డంపెట్టుకుని తమపై బురదజల్లే కార్కక్రమాన్ని చేశామన్నారు. జగన్ పై దాడి ఆతర్వాత జరిగిన పరిణామాలపై పోలీసులు విఫలమయ్యారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం తనదని, మీరు ఎక్కడ విఫలమైనా చెడ్దపేరు నాకే వస్తుందని చంద్రబాబు పోలీసు అధికారులను హెచ్చరించారు. విశాఖలో కుట్లువేసే డాక్టర్లు లేరా? దానికి హైదరాబాద్ వెళ్లాలా? అని ప్రశ్నించారు.