మరణాలను కప్పి పుచ్చుతున్నారు

తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఆక్సిజన్ ఐదు నిమిషాలు ఆలస్యమయిందని కలెక్టర్ చెబుతున్న దానిలో నిజం లేదన్నారు. ఐదు [more]

Update: 2021-05-12 00:36 GMT

తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఆక్సిజన్ ఐదు నిమిషాలు ఆలస్యమయిందని కలెక్టర్ చెబుతున్న దానిలో నిజం లేదన్నారు. ఐదు నిమిషాలు ఆక్సిజన్ లేకపోతే అంత మంది చనిపోతారా? అని నారాయణ ప్రశ్నించారు. తమకు 26 మంది చనిపోయినట్లు సమాచారం ఉందని, ప్రభుత్వం మాత్రం 11 మంది మరణించారని చెబుతుందని నారాయణ అన్నారు. ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల నష్ట పరిహారం చెల్లించాలని నారాయణ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News