బాబుపై ప్రధాని మోదీ తొలి స్పందన ఇదే...!!

Update: 2018-11-27 10:33 GMT

తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య నడిచేది డబ్లూడబ్లూఎఫ్ వంటి నకిలీ పోరాటమని, ఆ రెండు పార్టీల చరిత్ర, శైలి ఒక్కటేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ కాంగ్రెస్, టీఆర్ఎస్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపైన కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

- దేశాన్ని ఒక్క కుటుంబం నాలుగు తరాలు కబ్జా చేసిందని, తెలంగాణను ఒక్క కుటుంబం నాలుగేళ్లుగా కబ్జా చేసింది. ఒక్క కుటుంబం కోసం తెలంగాణ యువకులు త్యాగాలు చేశారు.

- ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే టీఆర్ఎస్ ముస్లింలకు రిజర్వేషన్లు అంటోంది. కాంగ్రెస్ కూడా ఇటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలే చేసింది.

- వైఎస్ఆర్ అయినా, చంద్రబాబు అయినా, కిరణ్ అయినా, కేసీఆర్ అయినా వారి వద్ద మోకాళ్లపై కూర్చోవాలంటే. స్వాభిమానం కలిగిన తెలంగాణ ప్రజలకు ఇటువంటి వారు ముఖ్యమంత్రులుగా అవసరమా ?

- కేసీఆర్ చంద్రబాబు వద్ద, తర్వాత సోనియా వద్ద శిక్షణ పొందారని, అటువంటి గురువులు ఉంటే కేసీఆర్ పాలన ఎలా బాగుంటుందని ఎద్దేవా చేశారు. గురువులు ఎలా ఉంటారో శిష్యులూ అలానే తయారవుతారన్నారు.

- అమరవీరుల త్యాగాలను గుర్తుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకుండా ప్రజలు బుద్ధిచెప్పాలి.

- వాజ్ పేయీ మూడు రాష్ట్రాల విభజన చేసింది. విడిపోయిన ఆరు రాష్ట్రాలు అభివృద్ధి సాధించి సుఖంగా ఉన్నాయి. కానీ, కాంగ్రెస్ ఏపీ విభజన చేస్తే... తెలంగాణ, ఏపీ మధ్య ఇంకా గొడవ జరుగుతూనే ఉంది.

- కేసీఆర్ మంత్రిగా పనిచేసిన సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చిందో... దానికి అనేక రెట్లు ఎక్కువగా బీజేపీ ఏపీ, తెలంగాణకు నిధులు ఇస్తోంది.

- దేశానికి తొలి ప్రధానిగా రైతుబిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ అయ్యి ఉంటే దేశంలో ఈ రోజు రైతులకు ఇంత కష్టం ఉండేది కాదు. సర్దార్ పటేల్ లేకపోతే ఇవాళ హైదరాబాద్ కి వెళ్లాలంటే పాకిస్తాన్ వీసా తీసుకోవాల్సి వచ్చేది. పటేల్ పైన తెలంగాణ ప్రజలకు ప్రేమ ఎక్కువగా ఉంటుంది. సమయం తీసుకుని కచ్చితంగా గుజరాత్ లోని సర్దార్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించండి.

- 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం. దేశంలో ఒక్క కుటుంబం కూడా సొంతిల్లు లేని వారు లేకుండా చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం.

- తెలంగాణ యువకులపై బుల్లెట్లు కురిపించిన కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారు ? ఆ పార్టీకి బుద్ధిచెప్పాలి.

- పెద్దపెద్ద మాటలు చెప్పడంలో కేసీఆర్ ముందుంటారు. 2 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు ? కానీ, మేము మాట ఇచ్చి నాలుగేళ్లలో 1 కోటి 25 లక్షల ఇళ్లు నిర్మించి ప్రజలకు తాళాలు ఇచ్చాం.

- తెలంగాణ ఉజ్వళంగా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ లను వదిలి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి.

Similar News