అనంతలో నిర్లక్ష్యం వల్లనే అంటుకుంది

ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉందని వారికి తెలియదు. మామూలుగానే సాధారణ వైద్యం చేశారు. అయితే ఆ వ్యక్తికి కరోనా ఉందని ఆలస్యంగా తెలయడం, వైద్యుల నిర్లక్ష్యం [more]

;

Update: 2020-04-09 02:14 GMT
corona virus, telangana, positive cases, deaths, recovery
  • whatsapp icon

ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉందని వారికి తెలియదు. మామూలుగానే సాధారణ వైద్యం చేశారు. అయితే ఆ వ్యక్తికి కరోనా ఉందని ఆలస్యంగా తెలయడం, వైద్యుల నిర్లక్ష్యం వెరసి అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ రోగుల సంఖ్య పెరడానికి కారణమయింది. హిందూపురంలో ఒక వ్యక్తి జ్వరం, దగ్గుతో ఆసుపత్రికి రాగా అతనిని చెస్ట్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు తర్వాత పరీక్షలు చేయగా అతనికి కరోనా అని తేలింది. అప్పటికే రెండు మూడు రోజులు చెస్ట్ ఆసుపత్రిలోని సాధారణ వార్డులోనే ఆ రోగి ఉన్నారు. ఆరోగి మృతి చెందిన తర్వాతనే కరోనాగా తేలింది. దీంతో ఆ రోగికి వైద్యం చేసిన ఇద్దరు వైద్యుడు, నర్సులు ఇద్దరికి, రోగి తల్లికి, కుమారుడికి, అతని ఆసుపత్రికి తీసుకువచ్చని అంబులెన్స్ డ్రైవర్ కు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అనంతపురం జిల్లాలో ఒక నిర్లక్ష్యమే కేసుల పెరగడానికి కారణమని చెప్పక తప్పదు. ఆసుపత్రిలో వైద్య సేవలందించిన వైద్యులకు, నర్సులకు పాజిటివ్ అని తేలడంతో మరెంత మందికి ఈ వ్యాధి అంటుకుంటుందోనన్న భయం నెలకొని ఉంది. దీంతో అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13 కుచేరుకుంది. ఇద్దరు మరణించారు.

Tags:    

Similar News