మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శిగా నంబళ్ల కేశవరావు అలియాస్ బస్వారాజ్ ను పార్టీని నియమించింది. ఆయన మూడున్నర దశాబ్దాలుగా పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు. ఇంతకాలం కేంద్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న గణపతి ఆ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. 1992లో అప్పటి పీపుల్స్ వార్ కి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గణపతి 26 ఏళ్ల పాటు మావోయుస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి గా కొనసాగారు. గణపతి స్థానంలో బస్వరాజ్ ను నియమించినట్లు మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటన విడుదల చేశారు.