మూడో విడతపై నిమ్మగడ్డ పూర్తి సంతృప్తి

ఆంధ్రప్రదేశ్ లో మూడో విడత జరిగిన పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లు అత్యధిక శాతం తరలి [more]

Update: 2021-02-18 04:58 GMT

ఆంధ్రప్రదేశ్ లో మూడో విడత జరిగిన పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లు అత్యధిక శాతం తరలి రావడాన్ని ఆయన అభినందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని ఓటర్లు మరోసారి నిలబెట్టారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. సమస్యాత్మక ప్రాంతంలోనూ అధికారులకు ప్రజలు సహకరించారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును ఆయన మెచ్చుకున్నారు. చివరి విడతలోనూ ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News