నిమ్మగడ్డ మరో కీలక నిర్ణయం

మున్సిపల్ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్ వేసి మృతి చెందిన వారి స్థానంలో ఆయా పార్టీలకు [more]

Update: 2021-02-21 01:38 GMT

మున్సిపల్ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్ వేసి మృతి చెందిన వారి స్థానంలో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేసుకునేలా వెసులు బాటుకల్పిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం లోపు నామినేషన్లు వేసుకోవచ్చని ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. మొత్తం 56 మంది మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు వేసి మృతి చెందినట్లు ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. వీరి స్థానంలో ఆ పార్టీకి చెందిన మరో వ్యక్తి నామినేషన్ వేసే అవకాశాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కల్పించారు.

Tags:    

Similar News