వర్లపై నిమ్మగడ్డ ఆగ్రహం.. బయటకు వెళ్లాలంటూ?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, టీడీపీ నేత వర్ల రామయ్యకు మధ్య వాగ్వాదం జరిగింది. తనను మాట్లాడనివ్వకుండా వర్ల రామయ్య అడ్డుకుంటుండటంతో నిమ్మగడ్డ రమేష్ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, టీడీపీ నేత వర్ల రామయ్యకు మధ్య వాగ్వాదం జరిగింది. తనను మాట్లాడనివ్వకుండా వర్ల రామయ్య అడ్డుకుంటుండటంతో నిమ్మగడ్డ రమేష్ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, టీడీపీ నేత వర్ల రామయ్యకు మధ్య వాగ్వాదం జరిగింది. తనను మాట్లాడనివ్వకుండా వర్ల రామయ్య అడ్డుకుంటుండటంతో నిమ్మగడ్డ రమేష్ కుమర్ సెక్యూరిటీతో బయటకు పంపారు. అన్ని పార్టీల నేతలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో అన్ని పార్టీలూ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కానీ అందరి అభిప్రాయాలు విన్న తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతుండగా పదే పదే వర్లరామయ్య జోక్యం చేసుకుంటుండం నిమ్మగడ్డకు ఆగ్రహం తెప్పించింది. దీంతో సెక్యూరిటీ వాళ్ల చేత వర్ల రామయ్యను బయటకు పంపే ప్రయత్నం చేశారు. అయితే అందరూ సర్దుబాటు చేశారు.