చంద్రబాబు నిర్భంధంపై నిమ్మగడ్డ రెస్పాన్స్ ఇదే

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. తమను చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన కోసం [more]

Update: 2021-03-02 01:17 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. తమను చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన కోసం ఎటువంటి అనుమతులు కోరలేదని తెలిపారు. కాగా చంద్రబాబును తిరుపతి ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 9 గంటల పాటు చంద్రబాబు ఎయిర్ పోర్టులోనే నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిరసనలకు అవకాశం లేదని చెప్పారు. అయితే దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పర్యటనకు తమ నుంచి అనుమతి తీసుకోలేదని చెప్పడం విశేషం.

Tags:    

Similar News