నామినేషన్ల ఉపసంహరణపై నిమ్మగడ్డ తాజా ఆదేశాలివే

నామినేషన్ల ఉపసంహరణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. నిన్న పెద్ద సంఖ్యలో నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో రిటర్నింగ్ అధికారులకు [more]

Update: 2021-03-03 05:56 GMT

నామినేషన్ల ఉపసంహరణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. నిన్న పెద్ద సంఖ్యలో నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో రిటర్నింగ్ అధికారులకు మరోసారి ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థి లేకుండా నామినేషన్లు ఉపసంహరించవద్దని ఆయన తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు. బెదిరించి, ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు ఉపసంహరిస్తున్నారన్న ఫిర్యాదుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఉపసంహరణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో ద్వారా చిత్రీకరించాలని కోరారు.

Tags:    

Similar News