కోలుకోలేకపోతోందే.. రోజురోజుకూ పెరుగుతున్నాయ్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరోజే 193 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ‌్య 5,280కి చేరింది. [more]

;

Update: 2020-06-17 02:57 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరోజే 193 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ‌్య 5,280కి చేరింది. కొత్తగా రెండు మరణాలు సంభవించాయి. దీంతో ఏపీలో మరణాల సంఖ్య 88కి చేరింది. కరోనా వైరస్ ఏపీిని వదలడం లేదు. రోజుకు రెండు వందలకు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా కర్నూలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వ్యాప్తి ఎక్కువగా ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ యాక్టివ్ కేసులు ఏపీలో 2,341 ఉన్నాయి. ఇప్పటి వరకూ 2,851 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Tags:    

Similar News