కరోనా ఏపీని కరిచేస్తుంది… ఆగని కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్కరోజే 294 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్కరోజే 294 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్కరోజే 294 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,152కు చేరుకుంది. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 84 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఒక్క విజయవాడ నగరంలోనే ఎక్కువ కేసులు కన్పిస్తున్నాయి. దాదాపు విజయవాడలో ఎక్కువ భాగం కంటెయిన్ మెంట్ జోన్ కింద వెళ్లిపోయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 39 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా సోకింది. ఇప్పటి వరకూ ఏపీలో కరోనా నుంచి కోలుకుని 2,723 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 2,034 మంది చికిత్స పొందుతున్నారు.