అన్నయ్య వస్తాడో.. రాడో ఇప్పుడే చెప్పలేను

చిరంజీవి ఇప్పుడే జనసేన పార్టీలోకి వస్తారా? రారా? అన్నది తాను చెప్పలేనని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ‌్ అన్నారు. అయితే తన అన్న చిరంజీవి తన [more]

;

Update: 2021-01-30 01:03 GMT

చిరంజీవి ఇప్పుడే జనసేన పార్టీలోకి వస్తారా? రారా? అన్నది తాను చెప్పలేనని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ‌్ అన్నారు. అయితే తన అన్న చిరంజీవి తన విజయాన్ని మాత్రం ఎప్పుడూ కోరుకుంటారని, ఆయన నైతిక మద్దతు తనకు ఎప్పుడూ ఉంటుందని పవన్ కల్యాణ‌్ తెలిపారు. కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో సమావేశం సందర్భంగా పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు, మతం, కులం, ప్రాంతం వంటివి తెలియదని, అయితే కాపు సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు. భవిష్యత్ లో కాపుల సమస్యలను పరిష్కరించడానికి అండగా ఉంటానని పవన్ కల్యాణ‌ తెలియజేశారు.

Tags:    

Similar News