Pawan : నేడు మంగళగిరికి పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు మంగళగిరిలో పర్యటించనున్నారు. అయితే ఇక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశముందని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై [more]

;

Update: 2021-09-29 02:59 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు మంగళగిరిలో పర్యటించనున్నారు. అయితే ఇక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశముందని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళగిరిలో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే అవకాశముందని భావించిన పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. పార్టీ నేతలతో సమావేశాన్ని పవన్ కల్యాణ్ నిర్వహించబోతున్నారు.

Tags:    

Similar News