Pawan : రాజమండ్రి సభపై ఉత్కంఠ… మరికాసేపట్లో…?

నేడు పవన్ కల్యాణ‌్ రాజమండ్రి వెళ్లనున్నారు. అక్కడ జరిగే శ్రమదానం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రాజమండ్రిలోని బాలాజీ సెంటర్ లో పవన్ కల్యాణ్ రో్డ్డుకు మరమ్మత్తులు చేస్తారు. [more]

;

Update: 2021-10-02 01:18 GMT

నేడు పవన్ కల్యాణ‌్ రాజమండ్రి వెళ్లనున్నారు. అక్కడ జరిగే శ్రమదానం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రాజమండ్రిలోని బాలాజీ సెంటర్ లో పవన్ కల్యాణ్ రో్డ్డుకు మరమ్మత్తులు చేస్తారు. అక్కడ నుంచి నేరుగా పవన్ కల్యాణ్ పుట్టపర్తి వెళ్లనున్నారు. రాజమండ్రిలో బాలాజీ నగర్ లో బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కోవిడ్ కారణంగా నిబంధనలు అనుసరించి సభను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు జనసేనకు సూచించారు. సభకు వస్తే కేసులు పెడతామని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ్ రాజమండ్రి సభపై ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News