Pawan : తిక్క బాగా తలకెక్కినట్లుంది

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రిలో హల్ చల్ చేశారు. కారు పైకి ఎక్కి వీరంగం చేశారు. పోలీసులపై నిప్పులు చెరిగారు. తన కాన్వాయ్ ను పోలీసులు [more]

;

Update: 2021-10-02 07:44 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రిలో హల్ చల్ చేశారు. కారు పైకి ఎక్కి వీరంగం చేశారు. పోలీసులపై నిప్పులు చెరిగారు. తన కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను ఎందుకు అడ్డుకుంటున్నారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. శ్రమదానం కోసం వస్తే పోలీసులు అడ్డుకుంటారా? అని ఫైర్ అయ్యారు. రాజకీయ నేతగా పవన్ కల్యాణ్ వ్యవహరించాల్సిన తీరు ఇది కాదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. శాంతియుతంగా శ్రమదానం చేస్తామన్నా ఒప్పుకోరా అంటూ పవన్ కల్యాణ్ నిలదీశారు. పొలిటికల్ లీడర్ గా ఆయన బాడీ లాంగ్వేజీ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News