Pawan : ద్వారంపూడికి ఒళ్లు బలిసింది… పవన్ ఫైర్

వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. ఆయన తనపై చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేవిగా ఉన్నాయన్నారు. నోరుంది కదా? అని [more]

;

Update: 2021-10-02 08:46 GMT

వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. ఆయన తనపై చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేవిగా ఉన్నాయన్నారు. నోరుంది కదా? అని ఇష్టం వచ్చినట్లు వాగితే కుదరదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ద్వారంపూడి ఒక అవినీతి పరుడని పవన్ కల్యాణ్ అన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని తాను ఒక్క మాట కూడా అనలేదన్నారు. అహంకారంతోనే ద్వారంపూడి తనను తిట్టారన్నారు. అన్ని కులాలను గౌరవించాలన్నారు. ఏం పొడిచావని నీకంత అహంకారమని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తనను తిట్టడమంటే తన కులాన్ని తిట్టడమేనని చెప్పారు. అడ్డగోలుగా సంపాదించి ఒళ్లు బలిసి నోటికొచ్చినట్లు వాగుతున్నారన్నారు.

Tags:    

Similar News