Pawan : జగన్ అందరి రెడ్లకు న్యాయం చేయరు…కేవలం వారికే

తన పార్టీలో చేరాలంటే కొన్ని షరతులు ఉంటాయని పవన్ కల్యాణ్ చెప్పారు. రెండు దశాబ్దాల పాటు తనతో ప్రయాణం చేయాలనుకునే వారే పార్టీలోకి రావాలన్నారు. తన వెంట [more]

;

Update: 2021-10-02 08:53 GMT

తన పార్టీలో చేరాలంటే కొన్ని షరతులు ఉంటాయని పవన్ కల్యాణ్ చెప్పారు. రెండు దశాబ్దాల పాటు తనతో ప్రయాణం చేయాలనుకునే వారే పార్టీలోకి రావాలన్నారు. తన వెంట నడిచి గెలిచి ఇతర పార్టీలోకి వెళ్లాలనుకున్న వారికి తన వద్ద చోటు లేదని పవన్ కల్యాణ్ చెప్పారు. తాను స్వచ్ఛ రాజకీయాలను చేయాలని వచ్చానన్నారు. ఓపిక ఉన్న వారే తన వెంట నడవాలన్నారు. తనకు ఒక స్పష్టమైన అవగాహన ఉందన్నారు. మంత్రి తనతో పాటు తన కులాన్ని కూడా తిట్టారని మంత్రి పేర్నినాని గురించి పరోక్షంగా ప్రస్తావించారు. జగన్ తన సామాజికవర్గం వారికి కూడా న్యాయం చేయడం లేదని, తనకు స్నేహితుడైన నెల్లూరు రెడ్డిగారు ఒకరు చెప్పారన్నారు. జగన్ చుట్టూ ఉన్న రెడ్డి నేతలే లబ్ది పొందుతున్నారని, ఇతర పార్టీల్లో ఉన్న రెడ్డి నేతలపై కూడా తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తుందని పవన్ కల్యాణ్ ఫైరయ్యారు. రాజమండ్రిలో శ్రమదానం తర్వాత జరిగిన సభలో పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. 4,572 వాహనాలను రాజమండ్రికి రాకుండా పోలీసులు ఆపేశారన్నారు. లక్షమందితో జరగాల్సిన సభను ఎక్కడికక్కడ అడ్డుకున్నారని చెప్పారు. తాను అన్ని కులాలను గౌరవిస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు.

Tags:    

Similar News