పొత్తులపై క్లారిటీ ఇచ్చిన పవన్

గౌరవం తగ్గేలా పొత్తులుండవని, ఎవరికీ లొంగిపోనని పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబుతో కలవడంపై ఆయన వివరణ ఇచ్చారు

Update: 2023-01-12 14:51 GMT

గౌరవం తగ్గేలా పొత్తులుండవని, ఎవరికీ లొంగిపోనని పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబుతో కలవడంపై ఆయన వివరణ ఇచ్చారు. చంద్రబాబుతో కలిసిన తర్వాత కొందరు వైసీపీ నేతలు పిచ్చికూతలు కూస్తున్నారన్నారు. తాను పరామర్శ కోసమే ఆయనను కలిశానని అన్నారు. తాను బేరాలాడే వ్యక్తిని కాదని, పాతికకోట్లు ట్యాక్స్ కట్టేవాడినని అన్నారు. విశాఖలో తనకు జరిగిన ఘటనపై చంద్రబాబు తనకు మద్దతు తెలిపారని అందుకే ఆయనను కలవాల్సి వచ్చిందన్నారు. సంబరాల రాంబాబు గురించి 22 నిమిషాలు, సన్నాసి ఐటీ మినిస్టర్ గురించి 18 నిమిషాలు, శాంతి భద్రతలపై అరగంటసేపు మాట్లాడనని తెలిపారు. రెండుసార్లు టీ తాగామని, ఏపీ భవిష్యత్ ఎలా ఉండాలి? వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని, కానీ తాను కోరుకుంటుంది స్టెబిలిటీ ఆఫ్ స్టేట్ అని అన్నారు. గతంలో తాను టీడీపీ తిట్టినా ఇప్పుడు సర్దుకుపోక తప్పదని అన్నారు. వచ్చే ఎన్నికలకు ఓటు చీలకూడదని, సీట్లు గురించి తాను చంద్రబాబుతో మాట్లాడలేదని, వ్యూహం ఉండాలని, ఒంటరిగా వెళ్లి వీరమరణం అవసరం లేదని, ఒంటరిగా పోటీ చేస్తే మీరు తనకు మద్దతిస్తారా? అని పవన్ ప్రశ్నించారు. కుదిరతే పొత్తు లేదంటే ఒంటరిగానే పోటీ చేస్తానని అన్నారు.

గౌరవం తగ్గదు.. లొంగిపోను...
దశాబ్దం నుంచి రాజకీయాలు చేస్తున్నానని అన్నారు. ఓట్లుమాత్రం చీలనివ్వనని అన్నారు. పడని ప్రత్యర్థులను కూడా కలుపుకుని పోవాలన్నారు. గౌరవం తగ్గకుండా, లొంగిపోకుండా కుదిరితే చేస్తాం లేదంటే ఒంటరిగానే పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. ఏరోజైనా మీ గౌరవాన్ని తగ్గించానా? చెప్పండి అని ప్రశ్నించారు. రాజకీయమంతా మూడు కులాల చుట్టూ తిరుగుతందని, రెడ్డి, కమ్మ, కాపుల చుట్టే ఎందుకని పవన్ ప్రశ్నించారు. వారాహితో వస్తానని, ఎవరాపుతారో చూస్తామని ఆయన సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రను ఆర్థిక రాజథానిగా మారుస్తామని చెప్పారు.
ఎవరినీ మోసం చేయను...
నాగావళి పనులను పూర్తి చేస్తామన్నారు. మత్స్యకారులు పాకిస్థాన్ కు వెళ్లే అవసరం లేకుండా చూస్తామన్నారు. ఆంధ్రయూనివర్సిటీని ప్రక్షాళన చేస్తామని అన్నారు. వైసీపీ కార్యాలయంగా చేసిన ప్రతి ఒక్కరికీ శిక్ష పడక తప్పదని హెచ్చరించారు. తాను ఒకరోజు సినిమా షూటింగ్ కు వెళితే కోటి రూపాయలు వస్తానని, కోటి వదులుకుని కోట్లమంది కోసం రోడ్లపైకి వస్తానని తెలిపారు. తాను పార్టీని నడపడం కోసమే సినిమాలు చేస్తున్నానని అన్నారు. మీ నుంచి సంపాదించుకున్న సొమ్ముతో మోసం చేయనని, దగా చేయనని, మీ అందరితో ఉంటానని అన్నారు. కాపుకులానికి ఎంత గౌరవిస్తానో ఇతర కులాలకు అంతే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.


Tags:    

Similar News