ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేశారని తాను సొంత అన్నయ్యను కాదని టీడీపీకి మద్దతి ఇస్తే టీడీపీ వెళ్లి కాంగ్రెస్ తో చేతులు కలపడానికి సిగ్గు లేదా అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ...
- పార్లమెంటు లో మన ఎంపీలను అవమానించి రాష్ట్ర విభజన చేస్తే కడుపు మండి పార్టీ పెట్టాను.
- రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్రాన్ని బాగుచేస్తాడని చంద్రబాబుకు మద్దతు ఇచ్చాను. ఆయన రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తాడని అనుకుంటే ముఖ్యమంత్రి పదవి కోసం దిశానిర్దేశం చేసుకున్నారు.
- కనీసం సర్పంచ్ గా కూడా పోటీచేయని లోకేష్ దొడ్డిదారిన పంచాయతీరాజ్ మంత్రి అయ్యారు.
- యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యేగా ఓడిపోయినా లోకేష్ లానే దొడ్డిదారిన వెళ్లి మంత్రి అయ్యారు.
- రాష్ట్రంలో ఓట్లు ఎత్తికెళ్లే గ్యాంగులను టీడీపీ తయారు చేస్తోంది.
- ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే కేసులు పెడతామని చంద్రబాబు బెదిరించింది వాస్తవం కాదా..?
- కాంగ్రెస్ పార్టీ తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతీసినందుకు కడుపుమండి ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కర్ రావు వంటివారు ఆలోచించి టీడీపీ ని స్థాపించారు.
- తానెప్పుడూ ఇంతవరకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని, సామాన్య ప్రజలతో పొత్తు పెట్టుకున్నామన్నారు.
- తనకు సంస్కారం ఉందని బాలకృష్ణలా తాను తిట్టేలేనని పేర్కొన్నారు. నరేంద్ర మోదీకి గౌరవం ఇస్తూనే రాష్ట్రం కోసం పోరాడతాం.
-మొన్న చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. రేపు జగన్ తో కలిసిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు వ్యక్తిత్వం అలాంటిది.
- నేను బతికిండగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను.