నా సవాల్ కు సమాధానం లేదా చంద్రబాబూ?

తాను చేసిన సవాల్ కు ఇంతవరకూ సమాధానం చెప్పలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తాము తిరుపతిలో ఓడిపోతే తమ పార్టీకి చెందిన 22 మంది ఎంపీలు [more]

Update: 2021-04-16 01:01 GMT

తాను చేసిన సవాల్ కు ఇంతవరకూ సమాధానం చెప్పలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తాము తిరుపతిలో ఓడిపోతే తమ పార్టీకి చెందిన 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తామని సవాల్ విసిరామని, దీనిపై టీడీపీ ఇంతవరకూ స్పందించలేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యల దెబ్బకు చంద్రబాబు, లోకేష్ మైండ్ బ్లాంక్ అయిందని ఆయన ఎద్దేవా చేశారు. హిందూమతాన్ని రెచ్చగొట్టేలా బీజేపీ వ్యవహరించిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. పోలింగ్ శాతం బాగా పెరిగితే తమకు తిరుపతిలో ఆరు లక్షల మెజారిటీ వస్తుందని ఆయన తెలిపారు.

Tags:    

Similar News