బ్రేకింగ్ : నిమ్మగడ్డ ఆదేశాలపై పెద్దిరెడ్డి ఏమన్నారంటే?

ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిని ఇంటికే పరిమితం చేయాలనుకోవడం దుర్మార్గమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తాను నిమ్మగడ్డ రమేష్ చౌదరికి ఒకటే చెప్పదలచుకున్నానని, దేశంలో ఎవరికీ లేని [more]

Update: 2021-02-06 07:42 GMT

ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిని ఇంటికే పరిమితం చేయాలనుకోవడం దుర్మార్గమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తాను నిమ్మగడ్డ రమేష్ చౌదరికి ఒకటే చెప్పదలచుకున్నానని, దేశంలో ఎవరికీ లేని అపరమితమైన అధికారులు ఉన్నాయని భావిస్తున్నట్టుందన్నారు. చంద్రబాబుకు తొత్తుగా మారి వన్ సైడ్ గా వ్యవహరించి వైసీపీకి నష్టం చేయడానికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూనుకున్నారన్నారు. ఇలాంటి ఆదేశాలు వస్తాయని తాను ముందుగానే ఊహించానన్నారు. తాను పంచాయతీ రాజ్ శాఖ మంత్రినని, తన ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరుగుతున్నాయని, ఇలాంటి పిచ్చి ఆదేశాలు పనిచేయవని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తన మీద ఆదేశాలు ఇచ్చే ముందు అమలవుతాయో? లేదో? చూసుకోవాలన్నారు. నిమ్మగడ్డ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నిమ్మగడ్డ చంద్రబాబుతో చేతులు కలిపి పిచ్చి చేష్టలు చేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

Tags:    

Similar News