రేపు ఏపీలో అన్నీ బంద్… మంత్రుల ప్రకటన

రేపు జనతా కర్ఫ్యూ ఉండటంతో ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ ఏపీలో ఆర్టీసీ [more]

;

Update: 2020-03-21 07:05 GMT

రేపు జనతా కర్ఫ్యూ ఉండటంతో ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ ఏపీలో ఆర్టీసీ బస్సులు ఉండవని చెప్పారు. దూరప్రాంతాలకు కూడా బస్సులను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ప్రయివేటు బస్సుల యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు. ఇప్పటికే ఏపీలో షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు బంద్ అయ్యాయి. రేపు పెట్రోలు బంకులు కూడా మూసివేయాలని నిర్ణయించారు. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా రేపు రాష్ట్రంలో బంద్ వాతావరణం నెలకొనేలా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది.

Tags:    

Similar News