పల్నాడు బిడ్డను నేను
తన కారుపైనా, గన్ మెన్లపైన దాడి చేసింది రైతులు కాదని, టీడీపీ కార్యకర్తలు మాత్రమేనని మాచర్ల వైసీపీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయవాడ [more]
తన కారుపైనా, గన్ మెన్లపైన దాడి చేసింది రైతులు కాదని, టీడీపీ కార్యకర్తలు మాత్రమేనని మాచర్ల వైసీపీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయవాడ [more]
తన కారుపైనా, గన్ మెన్లపైన దాడి చేసింది రైతులు కాదని, టీడీపీ కార్యకర్తలు మాత్రమేనని మాచర్ల వైసీపీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయవాడ వెళుతుండగా చిన కాకాని వద్ద కొందరు ఆయన కారుపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత పిన్నెల్లి మాట్లాడుతూ తనపై దాడిచేసిన వారందరూ మద్యం తాగి ఉన్నారని, వారు టీడీపీ నేతలనే నని చెప్పారు. వారెవ్వరూ రాజధాని 29 గ్రామాలకు చెందిన వారు కాదని, బయట నుంచి టీడీపీ నేతలు వారిని తెప్పించారని పిన్నెల్లి ఆరోపించారు. రైతులు రూపంలో అల్లరి మూకలు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని పిన్నెల్లి సూచించారు. పల్నాడు ప్రాంతంలో పుట్టిన తనను ఎవరూ ఏమీ చేయలేరని, తాను ఎవరికీ భయపడనని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.
వైసీపీ సీరియస్….
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు దాడిపై వైసీపీ సీరియస్ అయింది. సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలను తీసుకోవాలని డీజీపీని వైసీపీ నేతలు కలవనున్నారు. వారు రైతులు కారని, రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు ఆందోళనను హింసాత్మకంగా మార్చాలని నిర్ణయించుకున్నారని వైసీపీ భావిస్తుంది.