పిన్నెల్లి పై దాడి.. ప్రభుత్వం సీరియస్

మాచర్ల వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై జరిగిన దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిన్న దాడి జరిగిన సంఘటనకు సంబంధించి వీడియో [more]

Update: 2020-01-08 06:58 GMT

మాచర్ల వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై జరిగిన దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిన్న దాడి జరిగిన సంఘటనకు సంబంధించి వీడియో ఫుటేజీలను పరిశీలిస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు, గన్ మెన్లపై దాడి చేసిన వారిని ఇప్పటికే పోలీసు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. వీరిలో కొందరు చిన కాకానికి చెందిన వారు కాగా, మరికొందరు పిడుగురాళ్లకు చెందిన వారు కూడా ఉన్నారని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. విద్యార్థులెవ్వరూ ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. మరోవైపు డీజీపీ గౌతం సవాంగ్ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. పిన్నెల్లిపై జరిగిన దాడి ఘటనతో పాటు రైతుల ఆందోళన, శాంతి భద్రతల సమస్యపై చర్చించారు.

Tags:    

Similar News