పిన్నెల్లి కారు హల్ చల్….?

కృష్ణా జిల్లాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు హల్ చల్ సృష్టించింది. కృష్ణా జిల్లాలోని ఉప్పులేరు చెక్ పోస్టు వద్ద కారు ను పోలీసులు ఆపినా ఆపకుండా వెళ్లారు. [more]

Update: 2020-04-16 04:37 GMT

కృష్ణా జిల్లాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు హల్ చల్ సృష్టించింది. కృష్ణా జిల్లాలోని ఉప్పులేరు చెక్ పోస్టు వద్ద కారు ను పోలీసులు ఆపినా ఆపకుండా వెళ్లారు. దీంతో కారును వెంబడించి పోలీసులు పట్టుకున్నారు. అయితే కారులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య ఉన్నారు. ఆమె బంధువుల ఇంట్లో ఫంక్షన్ కు హాజరయి వస్తున్నట్లు తెలిసింది. తొలుత కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ తర్వాత వదిలేశారు. నిన్న కనిగిరి ఎమ్మెల్యే బుర్రామధుసూదన్ యాదవ్ కూడా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. తాజా సంఘటనతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు లాక్ డౌన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

Tags:    

Similar News