వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

శ్రీకాకుళం జిల్లా పలాస వైసీపీ ఎమ్మెల్యే అప్పలరాజు పై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ పోలీసులు ఆయన పై కేసు నమోదు [more]

Update: 2020-05-14 06:51 GMT

శ్రీకాకుళం జిల్లా పలాస వైసీపీ ఎమ్మెల్యే అప్పలరాజు పై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ పోలీసులు ఆయన పై కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చి 15వ తేదీన ఒక వివాహానికి ఒడిశా వెళ్లిన శ్రీకాకుళం జిల్లా వాసులు అక్కడే లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయారు. వారిని శ్రీకాకుళం జిల్లాకు అప్పలరాజు తీసుకు వచ్చారు. అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా ఇతర రాష్ట్రం నుంచి 26 మందిని తీసుకురావడం, పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అప్పలరాజు ఆయనతో పాటు మరో తొమ్మిది మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Tags:    

Similar News