సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్యకేసులో…?
కలకలం రేపిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ సతీష్ హత్య కేసులో కూకట్పల్లి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అతని స్నేహితుడు హేమంత్‌ను కేసులో కీలకంగా మారినా ఓ మహిళతో [more]
కలకలం రేపిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ సతీష్ హత్య కేసులో కూకట్పల్లి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అతని స్నేహితుడు హేమంత్‌ను కేసులో కీలకంగా మారినా ఓ మహిళతో [more]
కలకలం రేపిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ సతీష్ హత్య కేసులో కూకట్పల్లి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అతని స్నేహితుడు హేమంత్‌ను కేసులో కీలకంగా మారినా ఓ మహిళతో సన్నిహిత సంబంధాలు హత్యకు కీలక మైన సాక్ష్యాలు గా మిగిలాయి. కూకట్‌పల్లిలో హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ సతీష్ హత్యకేసులో అన్ని కోణాల్లో పోలీసులు పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న మృతుడి స్నేహితుడు హేమంత్ ను పోలీసులు అదువులోకి తీసుకున్నారు..నిజాలను రాబట్టారు.
ఎవరు సహకరించారు…?
మృతుడి స్నేహితురాలు ప్రియాంకను పోలీసులు విచారించారు. హత్య జరగడానికి కొద్దిసేపటి ముందు ప్రియాంకను సతీష్ హాస్టల్ వద్ద వదిలి వెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సతీష్, హేమంత్‌తో కలిసి ఓ భవన నిర్మాణ సంస్థ నడుపుతుండగా… ఆర్థిక లావాదేవీల కారణంతోనే హత్య చేశాడా? లేక ప్రియాంకతో చనువుగా ఉండటం వల్ల తట్టుకోలేక ఈ హత్య చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేసారు. దర్యాప్తు లో అనేక నిజాలను రాబట్టారు. మృతుడు సతీష్ భార్య మాత్రం తన భర్త చాలా మంచి వాడని చెబుతోంది. హత్యకు గురవ్వక ముందు తనతో మాట్లాడాడని, హేమంత్ ఇంటికి వెళ్తున్నట్లు చెప్పాడని పేర్కొంది. తన భర్త వ్యాపార భాగస్వామ్యులపై అనుమానం ఉందని, కాల్ డేటా, వాట్సప్ మెసేజ్‌లను పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుందని ఆమె ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఆ దిశగా జరిపిన విచారణ లో అనేక మైన వాస్తవాలు వెలుగుచూసి ఈ హత్య కేసులో కీలక సాక్ష్యాలు గా మిగిలాయి. నిందితుడు హేమంత్ అరెస్ట్ తో ఈ మర్డర్ కేసు మిష్టరీ వీడినట్టు సమాచారం. తనకు పరిచయస్తురాలైన ప్రియాంక అనే యువతితో హేమంత్ అక్రమ సంబంధం పెట్టుకోవడం సతీశ్‌కు నచ్చలేదని, ఈ విషయంపై ఇద్దరికీ చాలాసార్లు గొడవలు కూడా జరిగాయని పోలీసులు గుర్తించారు. ప్రియాంకను వదిలేయాలని సతీశ్ పదేపదే కోరడంతో తాను ఓర్వలేకే అతడిని హత్య చేసినట్లు హేమంత్ పోలీసుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ హత్య తానొక్కడినే చేశానని, ఇందులో ప్రియాంక ప్రమేయం ఏమీ లేదని అతడు చెప్పినట్లు సమాచారం.