ఆంక్షల మధ్య?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈరోజు అమరావతి జేఏసీ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. దీనికి పోలీసులు ఆంక్షలు విధించారు. రాజమండ్రిలో చంద్రబాబు వస్తున్న సందర్భంగా టీడీపీ నేతలు [more]

;

Update: 2020-01-10 03:44 GMT
విద్యార్థి సంఘాలు
  • whatsapp icon

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈరోజు అమరావతి జేఏసీ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. దీనికి పోలీసులు ఆంక్షలు విధించారు. రాజమండ్రిలో చంద్రబాబు వస్తున్న సందర్భంగా టీడీపీ నేతలు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతివ్వలేదు. మరోవైపు నేడు జేఏసీ సమావేశానికి కూడా పోలీసులు అనుమతివ్వలేదు. జేఏసీ కార్యాలయానికి పోలీసులు తాళాలు వేశారు. టీడీపీ నేతలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్ లను హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు రాజధాని రైతులు ఈరోజు అమరావతిని కాపాడాలంటూ దుర్గమ్కకు మొక్కులు తీర్చుకోనున్నారు. తుళ్లూరు నుంచి దుర్గగుడికి ర్యాలీగా మహిళలు వెళ్లనున్నారు. దీనికి కూడా పోలీసులు అనుమతించలేదు. మహిళల పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.

Tags:    

Similar News