Petrol : గ్యాప్ లేకుండా బాదేస్తున్నారే

చమురు కంపెనీలు వినియోగదారుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తున్నాయి. ప్రతి రోజు పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుతున్నాయి. ప్రతి రోజు ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. [more]

Update: 2021-10-14 05:10 GMT

చమురు కంపెనీలు వినియోగదారుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తున్నాయి. ప్రతి రోజు పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుతున్నాయి. ప్రతి రోజు ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈరోజు పెట్రోలుపై 34 పైసలు, డీజిల్ పై 37 పైసలు చొప్పున చమురు ధరలు పెంచాయి. ప్రతి మూడు రోజులకు మూడు రూపాలయ చొప్పున పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లీటరు పెట్రోలు ఎంతంటే….

ప్రస్తుతం హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర 108.96కు చేరుకుంది. లీటరు డీజిల్ ధర 102లుగా ఉంది. చమురు కంపెనీలు గత పది రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూనే పోతున్నాయి. అందుకే డీజిల్ కూడా వంద రూపాయలు దాటింది. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది.

Tags:    

Similar News