Petrol : వరస బాదుడు.. ఆగడం లేదు

పెట్రోలు ఉత్పత్తుల ధరలు మళ్లీ పెరిగాయి. వరసగా నాలుగోరోజు కూడా చమురు సంస్థలు పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచాయి. పెట్రోలుపై లీటరకు 35 పైసలు పెంచాయి. దీంతో [more]

Update: 2021-10-23 04:04 GMT

పెట్రోలు ఉత్పత్తుల ధరలు మళ్లీ పెరిగాయి. వరసగా నాలుగోరోజు కూడా చమురు సంస్థలు పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచాయి. పెట్రోలుపై లీటరకు 35 పైసలు పెంచాయి. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వందరూపాయలు దాటి పక్షం రోజులు దాటుతుంది. చమురు సంస్థలు పెట్రోలు ధరలను పెంచడమే కాని, తగ్గించడం లేదు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి.

హైదరాబాద్ లో….

తాజాగా పెరిగిన పెట్రోలు ధరలతో హైదరాబాద్ లో లీటరు పెట్రోలు 111.55 కు చేరుకుంది. డీజిల్ ధర 104.70 వరకూ పాకింది. వాహనాలను తీయాలంటేనే భయపడే పరస్థితి వచ్చింది. చమురు సంస్థలు ప్రజల పట్ల నిర్దయగా వ్యవహరిస్తున్నాయన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి.

Tags:    

Similar News