వైవీ… చేతకాకుంటే దిగిపో

తిరుమల తిరుపతి దేవస్థానం తన నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. లేకుంటే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. [more]

Update: 2021-08-31 08:47 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం తన నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. లేకుంటే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ కల్యాణ మండపాలను లీజుకిస్తామని ప్రకటన ఇవ్వడంపై రఘురామ కృష్ణరాజు అభ్యంతరం తెలిపారు. చిత్తూరు జిల్లాలోని కల్యాణ మండపాలను లీజుకిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. భక్తులు ప్రత్యేక ఉద్దేశ్యంతో స్థలాలను ఉచితంగా ఇస్తే అక్కడ కల్యాణ మండపాలను టీటీడీ నిర్మించిందని ఆయన గుర్తు చేశారు. లీజుకిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రఘురామ కృష్ణరాజు తెలిపారు. టీటీడీ పాలన చేతకాక పోతే వైవీ సుబ్బారెడ్డి రాజీనామా చేసి దిగిపోవాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News