చంద్రబాబు దీక్షకు రాహుల్ సంఘీభావం

ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీల అమలు చేయాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో చంద్రబాబు దీక్షకు ఆయన [more]

Update: 2019-02-11 05:56 GMT

ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీల అమలు చేయాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో చంద్రబాబు దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. గాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ఏపీ భారత్ లో అంతర్భాగం కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా హామీని అమలు చేసే బాధ్యత ప్రధాన మంత్రిపై ఉందన్నారు. నరేంద్ర మోడీ ఎక్కడకు వెళ్లినా అబద్ధాలే చెబుతారని, ఏపీలోనూ ప్రత్యేక హోదాపై అబద్దాలు చెబుతున్నారని అన్నారు. ఏపీ ప్రజల డబ్బు దోచుకొని అంబానీకి పెట్టాడు. మరో రెండు నెలల్లో నరేంద్ర మోడీకి బుద్ధి చెబుతామన్నారు. హామీలు సాధించుకునేందుకు ఏపీ ప్రజలు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు.

Tags:    

Similar News