ఆస‌క్తిక‌ర విష‌యం చెప్పిన రాహుల్ గాంధీ

Update: 2018-09-18 11:41 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా దామోద‌రం సంజీవ‌య్య‌ను కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌క‌టించే ముందు జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గుర్తు చేశారు. "అప్ప‌టి ప్ర‌ధాని నెహ్రూ... సంజీవ‌య్య‌ను ముఖ్య‌మంత్రిగా చేయాల‌నుకున్న‌ప్పుడు కొంద‌రు నేత‌లు ఆయ‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని నెహ్రూకు ఫిర్యాదు చేశారు. దీంతో నెహ్రూ ఓ సీనియ‌ర్ నేత‌ను విచారించ‌డానికి పంపించారు. ఆ నేత సంజీవ‌య్య స్వ‌గ్రామానికి వ‌చ్చి ఒక చిన్న ఇంటి ముందు క‌ట్టెల పొయ్య‌పై వంట చేసుకుంటున్న ఒక ముస‌లావిడ వ‌ద్ద‌కు వ‌చ్చి సంజీవ‌య్య ఇల్లు ఏది అని అడిగారు. ఆమె అదే ఇంటిని చూపించి, తానే ఆయ‌న ఆయ‌న త‌ల్లిని అని చెప్పింది. దీంతో ఆశ్చ‌ర్య‌పోయిన ఆ నేత ఢిల్లీ వెళ్లి నెహ్రూకు ఈ విష‌యం చెప్పారు. దామోద‌రం సంజీవ‌య్య గొప్ప‌ద‌నాన్ని, సామాన్య జీవ‌నాన్ని నెహ్రూకు వివ‌రించారు. దీంతో వారం రోజుల్లోనే నెహ్రూ సంజీవ‌య్య‌ను ముఖ్య‌మంత్రి గా ప్ర‌క‌టించారు. సంజీవ‌య్య వంటి గొప్ప నేత‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి వ‌చ్చారు." అని రాహుల్ గాంధీ అప్పుడు జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌ను చెప్పారు.

 

Similar News