ఎట్టకేలకు రాజాసింగ్ ప్రమాణస్వీకారం

భారతీయ జనతా పార్టీ తరపున గోషామహాల్ నుంచి విజయం సాధించిన రాజాసింగ్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ ఆయన చేత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణస్వీకారం [more]

;

Update: 2019-01-19 07:14 GMT

భారతీయ జనతా పార్టీ తరపున గోషామహాల్ నుంచి విజయం సాధించిన రాజాసింగ్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ ఆయన చేత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. హిందువులను తిట్టే ఎంఐఎం ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్ గా ఉన్నందున ఆయన ముందు ప్రమాణస్వీకారం చేయనని రాజాసింగ్ చెప్పిన విషయం తెలిసిందే. అందుకే అందరు ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ముందు ప్రమాణం చేసినా రాజాసింగ్ చేయలేదు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ మూడో రోజు ప్రారంభమైంది. గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News