సరిహద్దుల్లో మరణాలకు ఎవరిది బాధ్యత
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో సంభవించిన మరణాలకు ఎవరు బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. వైద్య సేవల కోసం తెలంగాణకు వచ్చేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో [more]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో సంభవించిన మరణాలకు ఎవరు బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. వైద్య సేవల కోసం తెలంగాణకు వచ్చేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో [more]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో సంభవించిన మరణాలకు ఎవరు బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. వైద్య సేవల కోసం తెలంగాణకు వచ్చేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో అంబులెన్స్ లోనే మృతి చెందారన్నారు. నంద్యాల, కడప జిల్లాకు చెందిన ఇద్దరు రోగులు అంబులెన్స్ ల్లోనే చనిపోవడం బాధాకరమని రామకృష్ణ అన్నారు. అంబులెన్స్ లను ఆపడం దుర్మార్గమని రామకృష్ణ అన్నారు. హైకోర్టు స్పష్టంగా చెప్పినా తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఈ మరణాలకు తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలని రామకృష్ణ అన్నారు.