బ్రేకింగ్ : జనసేన ఎమ్మెల్యే రాపాకకు నోటీసులు

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు ఆ పార్టీ నోటీసులు ఇచ్చింది. రెండురోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇటీవల పార్టీ వ్యతిరేక [more]

Update: 2019-12-12 14:38 GMT

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు ఆ పార్టీ నోటీసులు ఇచ్చింది. రెండురోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని జనసేన అభిప్రాయపడుతుంది. నేడు కాకినాడలో జరిగిన పవన్ దీక్షకు కూడా రాపాక వరప్రసాద్ డుమ్మా కొట్టారు. గత కొంతకాలంగా రాపాక వరప్రసాద్ పార్టీ లైన్ ను దాటి మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ మీడియం విషయంలోనూ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ రాపాక వరప్రసాద్ అసెంబ్లీలో మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల్లోనూ జగన్ ప్రభుత్వాన్ని పొగిడారు. రైతుల పట్ల జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రశంసిస్తూ రాజోలులో ఫ్లెక్సీలు కట్టడంపై కూడా జనసేన అధినేత పవన్ సీరియస్ అయినట్లు సమాచారం. మొత్తం మీద రాపాక వరప్రసాద్ జనసేన ఇచ్చిన నోటీసుకు ఏ సమాధానం చెబుతారో చూడాలి.

Tags:    

Similar News