బాబుకు ఏజ్ పెరిగింది కాని?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన విషప్రచారం వల్లనే వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద జనం ఎగబడుతున్నారన్నారు. [more]

Update: 2021-05-11 01:26 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన విషప్రచారం వల్లనే వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద జనం ఎగబడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధలనకు అనుగుణంగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు నిత్యం అబద్ధాలు చెబుతూ ప్రజలను కన్ ఫ్యూజ్ చేస్తున్నారన్నారు. ఎల్లో మీడియా కూడా చంద్రబాబుకు వత్తాసు పలుకుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అసలు చంద్రబాబు, లోకేష్ లు వ్యాక్సిన్ వేయించుకున్నారా? లేదా? అన్నది ప్రజలకు చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వం కేటాయింపుల ప్రకారమే ఏపీకి టీకా డోసులు వస్తాయని ఆయన తెలిపారు. చంద్రబాబుకు వయసు పెరిగింది కాని బుద్ధి పెరగలేదని, ఆయన బుర్ర నిండా విషం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు.

Tags:    

Similar News