అక్బోబరు 28వ తేదీన బీహార్ ఎన్నికలు..మూడు విడతల్లో
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బీహార్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. బీహార్ అసెంబ్లీతో పాటు 15 రాష్ట్రాల్లోని 64 [more]
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బీహార్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. బీహార్ అసెంబ్లీతో పాటు 15 రాష్ట్రాల్లోని 64 [more]
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బీహార్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. బీహార్ అసెంబ్లీతో పాటు 15 రాష్ట్రాల్లోని 64 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ పోలింగ్ ఉంటుంది. బహిరంగ సభలకు, ర్యాలీలకు అనుమతి లేదు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే పార్టీలు ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. పోలింగ్ సమయంలో మాస్కులు, భౌతిక దూరం అవసరమని పేర్కొంది. ఒక్కొక్క పోలింగ్ బూత్ లో వెయ్యి ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించు కుంటారన్నారు. కోవిడ్ రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. మొత్తం బీహార్ లో 7.29 కోట్ల మంది ఓటర్లున్నారు. పోలింగ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్క్ లు ఎన్నికల కమిషన్ పంపిణీ చేస్తుందని చెప్పారు. బీహార్ లో మొత్తం లక్ష పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తన్నట్లు ప్రకటించింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ధర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూడు విడతల్లో బీహార్ ఎన్నికలు ఉంటాయి. అక్బోబరు 28న, నవంబరు 3, 7వ తేదీల్లో బీహా ర్ఎన్నికలు జరగనున్నాయి.