వేరే యువతితో సంబంధం పెట్టుకుని..?

సాఫ్ట్ వేర్ భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య కుటుంబ సభ్యులు అంబర్ పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు . భర్త వేధింపులే [more]

Update: 2019-11-02 14:22 GMT

సాఫ్ట్ వేర్ భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య కుటుంబ సభ్యులు అంబర్ పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు . భర్త వేధింపులే తన కూతురు చనిపోవడానికి కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. అంబర్ పేట్ కు చెందిన సుకీత్ కు, కార్వాన్ ప్రాంతానికి చెందిన శివాని తో అయిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు. ఈ ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. సాఫీగా సాగిపోయింది వీరి వివాహ బంధం. కొన్ని సంవత్సరాల తరువాత శివాని కి భర్త నుండి వేధింపులు ఎదురయ్యాయి. వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న సుకీత్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. శివాని చనిపోవాలని వేరే పెళ్లి చేసుకుంటానని టార్చర్ చూపించాడు సుకీత్. ఆరు నెలల నుండి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.

వేధింపులు తట్టుకోలేకే….

భర్త సుకీత్ వేధింపులు తట్టుకోలేక నిన్న రాత్రి అంబర్ పేట్ నివాసంలో భార్య శివాని ఉరి వేసుకుంది. శివాని చనిపోయిన వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారాన్ని అందించాడు సుకీత్. సుకీత్ కు వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందంటూ ఈ మధ్యనే కుటుంబ సంభ్యులతో శివాని వివరించింది. ఉరి వేసుకునేందుకు సరిపోయేలా ఇంటి పైకప్పు కూడా లేదంటూ అనుమానం వ్యక్తం చేశారు శివాని కుటుంబ సభ్యులు. తక్కువ ఎత్తులో ఇంటి పైకప్పు ఉందని శివాని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News