Somu veerraju : బద్వేలు అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తాం

జనసేనతో కలసి చర్చించిన తర్వాత బద్వేలు అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. బద్వేలు లో ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపుతామని [more]

;

Update: 2021-09-29 05:59 GMT

జనసేనతో కలసి చర్చించిన తర్వాత బద్వేలు అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. బద్వేలు లో ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపుతామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాగాలేదని, జనసేనతో కలసి రోడ్ల శ్రమదానం చేపడతామని సోము వీర్రాజు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. రోడ్ల దుస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

Tags:    

Similar News